‘ఒక్క వివాహం చేసుకున్న‌వాళ్లు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉంటారు’..

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి (Madhyapradesh CM) మోహన్‌ యాదవ్‌ (Mohan Yadav) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నివసించాలంటే కేవలం ఒక్క వివాహం మాత్రమే చేసుకుని ఉండాలన్నారు. ఈ మేరకు త్వరలో యూనిఫామ్‌ సివిల్ కోడ్‌ (Uniform Civil Code) ను అమలులోకి తెచ్చే యత్నం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా చేయడమే దీని ఉద్దేశమని అన్నారు. రాబోయే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్‌ను ప్రవేశపెడుతుందని, అప్పుడు ఒకే వివాహం చేసుకున్న వారికి మాత్రమే రాష్ట్రంలో నివసించే చట్టపరమైన హక్కు ఉంటుందని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నొక్కి చెప్పారు. కట్నీ జిల్లాలో జరిగిన ఒక...