టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ కీలక నిర్ణయం..
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ (Samsung Electronics) అమెరికా (USA) లో తన కార్యకలాపాలను పునర్‌వ్యవస్థీకరించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. న్యూజెర్సీ (New Jersey) లోని తన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ అమెరికా (ఎస్ఈఏ) ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు తరలించడంతో పాటు, పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతను ప్రకటించింది. ఈ మార్పుల వల్ల వందలాది మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. ప్రధాన కార్యాలయాన్ని న్యూజెర్సీలోని ఎంగిల్‌వుడ్ క్లిఫ్స్ నుంచి టెక్సాస్‌లోని ప్లానోకు తరలించే ప్రక్రియలో భాగంగా 739 ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని శాంసంగ్ ధృవీకరించింది. వీరిలో ఎక్కువ మందికి టెక్సాస్‌కు మారేందుకు అవకాశం కల్పించగా.. ఆసక్తి చూపని వారిని విధుల నుంచి తొలగించారు. దీనికి...