ముంబై నటి జెత్వాని కేసులో సంచలన మలుపు..

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో సీఐడీ (CID) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌తో ఓ ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో సీఐడీ జరిపిన లోతైన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్సార్‌సీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్‌ను నటి కాదంబరి జెత్వాని బ్లాక్‌మెయిల్ చేసినట్లు సీఐడీ తన చార్జ్‌షీట్‌లో అధికారికంగా పేర్కొంది. ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిల్.. రూ.1.32 కోట్లు వసూలు! సీఐడీ చార్జ్‌షీట్ ప్రకారం.. కుక్కల విద్యాసాగర్‌తో తనకు ఉన్న సన్నిహిత సంబంధాలకు సంబంధించిన ఫొటోలను చూపించి కాదంబరి జెత్వాని ఆయనను బెదిరింపులకు గురిచేసింది. ఈ ఫొటోలను బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేసి, విద్యాసాగర్ నుంచి ఆమె రూ....