Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన టీఎన్‌జీవోస్ కాలనీ వాసులు

Author Neti Sudiksha | 21 Jun 2026, 12:13 PM | HEALTH, TELANGANA
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన టీఎన్‌జీవోస్ కాలనీ వాసులు

హనుమకొండ, జూన్ 21 (సుదీక్ష న్యూస్): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హనుమకొండలోని టీఎన్‌జీవోస్ కాలనీ ఫేజ్-2లో ఆదివారం ఉదయం యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాలనీకి చెందిన పలువురు పురుషులు, మహిళలు, వృద్ధులు ఉత్సాహంగా పాల్గొని వివిధ యోగా ఆసనాలు, ప్రాణాయామాలు చేశారు.
ఈ సందర్భంగా యోగా శిక్షకులు యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి తగ్గి ప్రశాంత జీవనం సాధ్యమవుతుందని వివరించారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు.
కాలనీవాసులు మాట్లాడుతూ యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వారసత్వమని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ యోగాను నిరంతరం ఆచరించాలని ప్రతిజ్ఞ చేశారు.
ఈ యోగా కార్యక్రమంలో టీఎన్‌జీవోస్ కాలనీ ఫేజ్-2కు చెందిన పలువురు సభ్యులు, వృద్ధులు, యువకులు పాల్గొని విజయవంతం చేశారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన టీఎన్‌జీవోస్ కాలనీ వాసులు - Additional Imageఅంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన టీఎన్‌జీవోస్ కాలనీ వాసులు - Additional Image