Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ముంబై నిరసనల్లో పోలీస్ వ్యాన్‌ను అడ్డుకున్న యువతి..

Author Neti Sudiksha | 23 Jul 2026, 01:00 PM | NATIONAL
ముంబై నిరసనల్లో పోలీస్ వ్యాన్‌ను అడ్డుకున్న యువతి..

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ, పరీక్షల నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకున్న ఓ ఘటన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆందోళనకారులను తీసుకెళ్తున్న పోలీసు వ్యాన్‌కు ఓ యువతి అడ్డుగా నిలిచి నిరసన తెలిపారు.
దాదర్‌లోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన విద్యార్థుల నిరసనల్లో రియా యాదవ్ అనే యువతి ఈ సాహసానికి పాల్పడ్డారు. వర్షంలో హుడీ, టోపీ ధరించి పోలీసు వ్యాన్ ఎదుట నిల్చున్న ఆమెను చూసి.. అక్కడి నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అప్పటికే అదుపులోకి తీసుకున్న కొందరు నిరసనకారులను పోలీసులు విడుదల చేసినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా రియా స్పందిస్తూ.. 'పోలీసులు తమ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించడం లేదు. వారు బాధ్యతగా వ్యవహరించకపోతే పౌరుల కోసం మేమే బాధ్యత తీసుకుంటాం' అని అన్నారు. తాను విద్యార్థిని కాకపోయినప్పటికీ.. విద్యార్థుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. మరోవైపు.. ఢిల్లీలో నిరసనకారులపై టియర్‌గ్యాస్‌, లాఠీఛార్జ్‌ వంటి ఘటనలనూ ఆమె ఖండించారు.