Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య నిర్ణయం- కొత్త లెక్కలు, 'డైరెక్ట్' వార్..!?

Author Neti Sudiksha | 23 Jul 2026, 01:33 PM | Politics
స్థానిక సంస్థల ఎన్నికల్లో అనూహ్య నిర్ణయం- కొత్త లెక్కలు, 'డైరెక్ట్' వార్..!?

ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమి వర్సస్ వైసీపీ మధ్య రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం అవుతోంది. మూడు పార్టీల సమన్వయం పైన ముఖ్య నేతలు ఫోకస్ చేసారు. సీట్ల పంపకాల పైన అధినేతలు చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారని సీఎం చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే స్థానిక ఎన్నికల్లో ప్రభుత్వం కొత్త ప్రతిపాదన తీసుకొస్తోంది. దీంతో.. ఇప్పుడు ఈ నిర్ణయం పార్టీలకు కీలకంగా మారనుంది. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా మున్సిపల్ ఎన్నిక లు నిర్వహించాలని భావిస్తోంది. ఇందు కోసం పార్టీ నేతలకు ఇప్పటికే స్పష్టత ఇచ్చిన సీఎం చంద్రబాబు.. మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలోని 123 మున్సిపల్ సంస్థ లకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ సమయంలోనే జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుల తో పాటుగా మున్సిపల్ చైర్మన్లు..మేయర్ల కు సంబంధించి ప్రత్యక్ష ఎన్నికల దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మేరకు అభిప్రాయ సేకరణ జరుగుతోంది. దీని ద్వారా వీరిని కూడా నేరుగా ఎన్నుకోవటంతో... ఫలితాల తరువాత ఎలాంటి వివాదాలు.. క్యాంపు రాజకీయాలకు అవకాశం ఉండదని భావిస్తున్నారు.