Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

జింబాబ్వేతో భారత్ టీ20 మ్యాచ్..

Author Neti Sudiksha | 23 Jul 2026, 02:48 PM | Sports
జింబాబ్వేతో భారత్ టీ20 మ్యాచ్..

ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో వరుస పరాజయాలతో విమర్శలు ఎదుర్కొన్న భారత జట్టు ఇప్పుడు జింబాబ్వేతో జరిగే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై దృష్టి సారించింది. గురువారం(జులై 23) నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని తిరిగిపొందాలని మెన్ ఇన్ బ్లూ భావిస్తోంది.
ఇటీవల యూకే పర్యటనలో టీమ్ఇండియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌ను 2-0తో, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-0తో కోల్పోయిన భారత్.. ఆ తర్వాత వన్డే సిరీస్‌నూ 2-1తో ఆతిథ్య జట్టుకే సమర్పించుకుంది. దీంతో జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కొత్తగా సారథ్య బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్.. నాయకుడిగా ఇప్పటివరకు గెలుపు రుచి చూడలేదు. ఈ నేపథ్యంలో జింబాబ్వే సిరీస్ అతడికి అగ్నిపరీక్షగా మారింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో నిరాశపరిచిన భారత బ్యాటింగ్ విభాగం.. ఈ సిరీస్‌లోనైనా గాడినపడాల్సి ఉంది.
ఇక ఈ మ్యాచ్‌లో.. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై అందరి దృష్టి నిలిచింది. ఈ సిరీస్‌లో అతడికి మరోసారి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం లభించింది. సంజూ శాంసన్ జట్టులో లేకపోవడంతో టాప్ఆర్డర్‌లో వైభవ్ కీలక పాత్ర పోషించే అవకాశముంది. గతంలో అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన హరారే మైదానంలోనే మరోసారి మెరుపులు మెరిపించాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు. కాగితాలపై బలంగానే భారత జట్టు.. ఇటీవలి ఫామ్‌ ఆధారంగా ప్రతీ మ్యాచ్‌ను అత్యంత జాగ్రత్తగా ఆడాల్సిన పరిస్థితి ఉంది. ఈ సిరీస్‌లో విజయం సాధించి తిరిగి గెలుపుబాట పట్టాలని టీమ్ఇండియా ఆశిస్తోంది.