Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

అసోంలో ఎడ‌తెగ‌కుండా కురుస్తున్న‌ వ‌ర్షాలు..

Author Neti Sudiksha | 23 Jul 2026, 03:38 PM | NATIONAL
 అసోంలో ఎడ‌తెగ‌కుండా కురుస్తున్న‌ వ‌ర్షాలు..

అసోం (Assam) లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains) తీవ్ర వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ప్రమాద హెచ్చరిక స్థాయిలను దాటి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో వరద పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వేలాది మంది ఇళ్లను వదిలి దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయారు. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గడిచిన 24 గంటల్లోనే నలుగురు చిన్నారులతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈ వ‌ర్షాలు, వరదల కారణంగా సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 41కి చేరుకుంది.
తాజా మరణాల్లో శివసాగర్ జిల్లాలో ముగ్గురు, జోర్హాట్‌లో ముగ్గురు, చరైడియో జిల్లాలో ఇద్దరు, ధేమాజీ, కర్బీ అంగ్లాంగ్ జిల్లాల్లో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీరితోపాటు మరో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు సహా మొత్తం ఆరుగురు వరద నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లోని 40 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని దాదాపు 939 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. మొత్తం 6.53 లక్షలకుపైగా ప్రజలు ఈ వరదల దాటికి తీవ్రంగా ప్రభావితమయ్యారు. బ్రహ్మపుత్ర నదితోపాటు దాని ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి.