Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మన మంత్రులు ఎవరూ చదువుకోలేదు..

Author Neti Sudiksha | 24 Jul 2026, 01:27 PM | హైదరాబాద్
మన మంత్రులు ఎవరూ చదువుకోలేదు..

నీట్‌ పేపర్‌ లీకేజీకి నిరసనగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెళ్లువెత్తుతున్నాయి. విద్యార్థులు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జికి నిరసనగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపటిన నిరసనకు వేలాది మంది తరలివచ్చారు. విద్యార్థుల ఉద్యమంపై తప్పుడు ప్రచారాన్ని ఖండించారు.
ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ..మాకు ఫండింగ్ రావడం కాదు.. బీజేపీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరికీ డబ్బులు ఇచ్చి మాపై తప్పుడు ఆరోపణలు చేయిస్తోందని మండిపడ్డారు.