Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్..

Author Neti Sudiksha | 27 Jul 2026, 11:08 AM | Cinema
ఇండియన్ ఐడల్ 16 విజేతగా జ్యోతిర్మయి నాయక్..

దేశవ్యాప్తంగా సంగీతాభిమానులను అలరించిన ప్రముఖ రియాలిటీ షో ‘ఇండియన్ ఐడల్ 16’ గ్రాండ్ ఫినాలే ఘనంగా ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో ఒడిశాకు చెందిన ప్ర‌ముఖ‌ గాయని జ్యోతిర్మయి నాయక్ విజేతగా నిలిచి ప్రతిష్ఠాత్మక ట్రోఫీని అందుకుంది. ఆమెకు రూ.20 లక్షల నగదు బహుమతిని కూడా నిర్వాహకులు ప్రదానం చేసినట్లు సమాచారం. జ్యోతిర్మయి నాయక్ ఇప్పటికే ఒడిశా సంగీత రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండియన్ ఐడల్ వేదికపైకి రాకముందు క్యాన్సర్‌తో పోరాడుతున్న బాధితులకు మ్యూజిక్ థెరపీ ద్వారా మానసిక ఉపశమనం కలిగించే సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంగీతం ద్వారా ఆనందాన్ని పంచాలనే ఆలోచనతో ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు జాతీయ స్థాయి విజయంగా మారింది.