Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

అంగన్వాడీల పేరుతో విషప్రచారం..

Author Neti Sudiksha | 28 Jul 2026, 03:02 PM | ANDHRA PRADESH
అంగన్వాడీల పేరుతో విషప్రచారం..

అంగన్వాడీల విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేశ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలోనే అంగన్వాడీలకు అమ్మఒడి పథకం అందలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం అమలు చేసిందని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలో తనకు మద్దతుగా అంగన్వాడీలు నిర్వహించిన కృతజ్ఞత ర్యాలీని వైసీపీ నేతలు కావాలనే నిరసన కార్యక్రమంగా చూపుతున్నారని మండిపడ్డారు. ఈ అంశంపై మంత్రి లోకేశ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ‘ఫేక్ వర్సెస్ రియల్’ పేరుతో వీడియోను విడుదల చేశారు. అంగన్వాడీల పేరుతో విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని మంత్రి తెలిపారు.