Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

నేనెక్కడికి పారిపోలేదు..

Author Neti Sudiksha | 28 Jul 2026, 03:12 PM | హైదరాబాద్
 నేనెక్కడికి పారిపోలేదు..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ పోలీస్‌ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఉదయ్‌ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఉదయ్‌ కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.Geographic Reference
2 రోజులుగా ఉదయ్‌ కృష్ణారెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండగా.. హైదరాబాద్‌లోని రెండు అడ్రస్‌ల్లోనూ ఉదయ్‌ కృష్ణారెడ్డి కనిపించడం లేదని వార్తలు వచ్చాయి. పోలీసులు ఉదయ్‌ కృష్ణారెడ్డి స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పరారిలో ఉన్నాడని, ఫోన్ కూడా స్విచాప్‌ వస్తుందన్న వార్తల నేపథ్యంలో ఉదయ్‌ కృష్ణారెడ్డి స్పందించాడు.