Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మాజీ మంత్రి కారుమూరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

Author Neti Sudiksha | 29 Jul 2026, 12:46 PM | ANDHRA PRADESH
మాజీ మంత్రి కారుమూరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది.Geographic Reference
ఈ కుంభకోణంతో తమకు ఎలాంటి సంబంధం లేదని, పిటిషనర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కారుమూరి తరఫు న్యాయవాది అభ్యర్థించారు. అయితే ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. లిక్కర్ స్కామ్‌లో రూ.350 కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు దర్యాప్తులో కనిపిస్తోందని చెప్పింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. అంతేకాకుండా ఈ కేసులో కస్టోడియల్ విచారణ అవసరమని స్పష్టం చేసింది.