Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల రద్దు..

Author Neti Sudiksha | 31 Jul 2026, 02:30 PM | ANDHRA PRADESH
19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్ల రద్దు..

ఏపీలోని యూనివర్సిటీల పాలనలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 19 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో నియమించిన నామినేటెడ్ సభ్యులను తొలగించింది. ఈ మేరకు ఆయా విశ్వవిద్యాలయాల గవర్నింగ్ బాడీల రద్దుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్లాజ్-2 కింద నియమితులైన పాలక మండలి సభ్యులపై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే పదవీ రీత్యా కొనసాగుతున్న సభ్యులకు ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది.