Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

నాకు15 ఏళ్లే.. న‌న్ను క్ష‌మించండి..

Author Neti Sudiksha | 01 Aug 2026, 12:29 PM | NATIONAL
 నాకు15 ఏళ్లే.. న‌న్ను క్ష‌మించండి..

ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్‌లో సీజేపీ నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న వేళ‌.. కొంద‌రు యువ‌త ప్ర‌ధాని మోదీని తిట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ ఓ వీడియో రిలీజ్ చేశారు. పిల్ల‌ల‌ను క్ష‌మిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అయితే తాజాగా ఆన్‌లైన్‌లో ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఓ అమ్మాయి ప్ర‌ధాని మోదీకి క్ష‌మాప‌ణ‌లు(Apology) చెప్పింది. గీతల టీష‌ర్ట్ వేసుకున్న ఆ అమ్మాయి చేతులు జోడించి మాట్లాడింది. త‌న వ‌య‌సు 15 ఏళ్ల మాత్ర‌మే అని, కానీ జంత‌ర్ మంత‌ర్‌లో అక్క‌డున్న వారిని చూసి.. మోదీని తిట్టిన‌ట్లు ఆ అమ్మాయి పేర్కొన్న‌ది. ప్ర‌ధాని మోదీ గురించి అన‌వ‌స‌రంగా చెడు మాట‌లు మాట్లాడిన‌ట్లు ఆమె పేర్కొన్న‌ది. కానీ పోలీసుల త‌మ ఎఫ్ఐఆర్‌లో ఆ అమ్మాయి వ‌య‌సు 25 ఏళ్లుగా రాసిన‌ట్లు తెలిసింది. ఇదే త‌న మొద‌టి, చివ‌రి త‌ప్పు అని ఆ వీడియోలో అమ్మాయి పేర్కొన్న‌ది. యావ‌త్ దేశానికి క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాన‌ని, సిగ్గుప‌డుతున్నాన‌ని, త‌న‌ను తాను చూసుకోలేక‌పోతున్నాన‌ని, ప్లీజ్ న‌న్ను క్ష‌మించండి అంటూ ఆ అమ్మాయి తెలిపింది.