Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఉగ్రకుట్ర భగ్నం..

Author Neti Sudiksha | 01 Aug 2026, 04:51 PM | NATIONAL
ఉగ్రకుట్ర భగ్నం..

పశ్చిమ బెంగాల్ పోలీసు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ (STF) ఉగ్ర కుట్రను భగ్నం చేసింది. ఇటీవలే అరెస్టయిన జైషే మహమ్మద్ (JeM) అనుమానిత ఉగ్రవాది మహమ్మద్ హమీమ్ మోండల్ స్నేహితురాలు అర్పిత సర్కార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌లో ఎస్టీఎఫ్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌కు తరలించారు.
అనుమానిత ఉగ్రవాది హమీమ్ మోండల్‌ను గురువారం బర్ధమాన్ పట్టణంలోని ఒక పెద్ద ఇంట్లో ఎస్టీఎఫ్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ (ISI) మద్దతుతో పనిచేస్తున్న ఒక పెద్ద ఉగ్ర నెట్‌వర్క్‌లో హమీమ్ కీలక పాత్ర పోషిస్తున్నాడని అధికారులు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ నాయకులతో పాటు పలువురు ముఖ్యమైన వీఐపీల సమాచారాన్ని సేకరించడం వారి టార్గెట్. దీని కోసం కొత్త వారిని రిక్రూట్‌మెంట్‌లో చేర్చుకోవడం, రాష్ట్రంలో ఉగ్ర కార్యకలాపాలకు ప్రణాళికలు రచించేందుకు సిద్ధమయ్యారు.