Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

తుంగభద్రకు పోటెత్తిన వరద

Author Neti Sudiksha | 08 Aug 2026, 02:25 PM | NATIONAL
తుంగభద్రకు పోటెత్తిన వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. గత ఏడాదితో పోలిస్తే జలాశయానికి వస్తున్న ప్రవాహం దాదాపు రెట్టింపు కావడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఎగువున ఉన్న తుంగడ్యామ్‌ నుంచి సుమారు 26,980 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో తుంగభద్ర డ్యామ్‌లోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. టీబీ బోర్డు అధికారులు తెలిపిన వివరాల మేరకు గత 24 గంటల వ్యవదిలో డ్యామ్‌లోకి సగటున 47,559 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, నీటిమట్టం క్రమంగా పెరుగుతూ 1622.55 అడుగులకు చేరుకుంది.