Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర‌..

Author Neti Sudiksha | 13 Aug 2026, 12:34 PM | NATIONAL
ఢిల్లీ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా కుట్ర‌..

ఢిల్లీ లోని ఎర్ర‌కోట వ‌ద్ద కారులో జ‌రిగిన‌ పేలుళ్ల వెనుక అల్‌ఖైదా అనుబంధ ఉగ్రవాద సంస్థ ‘అల్‌ఖైదా ఇన్ ఇండియన్ సబ్‌కాంటినెంట్కుట్ర ఉందని ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. 2025 నవంబర్‌లో ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనపై దర్యాప్తు నేపథ్యంలో ఈ అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. AQIS ను ప్రాంతీయ కార్యకలాపాలను విస్తరిస్తున్న ఉగ్రవాద సంస్థగా నివేదిక పేర్కొన్నట్లు తెలుస్తున్న‌ది.తాలిబన్ల నుంచి AQIS కు మద్దతు, ఆశ్రయం లభిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి భ‌ద్ర‌తామండ‌లి త‌న‌ నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం. దాంతో పలు ప్రాంతాల్లో అల్‌ఖైదా నెట్‌వర్క్ మరోసారి బలపడుతున్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా భారత్ సహా ఆయా దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు AQIS ముప్పుగా మారే అవకాశం ఉందని భద్రతావర్గాలు భావిస్తున్నాయి. 2025 నవంబర్‌లో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.