Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

జైలులో ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెల్‌ఫోన్‌లో 90 నీలి చిత్రాలు..!

Author Neti Sudiksha | 13 Aug 2026, 12:35 PM | NATIONAL
జైలులో ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ సెల్‌ఫోన్‌లో 90 నీలి చిత్రాలు..!

లైంగిక దాడి కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న జనతాదళ్ (సెక్యులర్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఆయన ఉన్న బ్యారక్ నుండి డజన్ల కొద్దీ అశ్లీల వీడియోలు ఉన్న మొబైల్ ఫోన్‌ను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది. జైలులోని ఖైదీల వ‌ద్ద సెల్‌ఫోన్స్ ఉన్నాయ‌నే స‌మాచారం మేర‌కు కర్ణాక‌ట‌క హోమంత్రి ప్రియాంక్ ఖ‌ర్గే ఆదేశాల మేర‌కు సెంట్ర‌ల్ క్రైం బ్యాంచ్ అధికారులు అగ్రహార సెంట్రల్ జైలులో ఆక‌స్మిక త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ తిన‌ఖీల్లో ప్ర‌జ్వ‌ల్ బ్యార‌క్‌తో స‌హా మొత్తం 10 సెల్‌ఫోన్స్ దొరికిన‌ట్లు అధికారులు తెలిపారు. హై-ప్రొఫైల్ ఖైదీల బ్యారక్‌లు, హై-సెక్యూరిటీ జైలు విభాగాల్లో సీసీబీ అధికారులు దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల పాటు సోదాలు నిర్వహించారు. త‌నిఖీల్లో మొబైల్ ఫోన్‌తో పాటు, రేవణ్ణ బ్యారక్ నుండి ఒక పెన్ డ్రైవ్, ఛార్జర్‌ను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.