Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

రాహుల్ సిప్లిగంజ్ నన్ను బెదిరించలేదు.. తప్పుడు ప్రచారం నమ్మవద్దు..

Author Neti Sudiksha | 14 Aug 2026, 10:00 PM | Cinema
 రాహుల్ సిప్లిగంజ్ నన్ను బెదిరించలేదు.. తప్పుడు ప్రచారం నమ్మవద్దు..

విశాఖపట్నంలో తీవ్ర కలకలం రేపిన రాహుల్ రెడ్డి కేసు వ్యవహారం ప్రస్తుతం ఒక ముగింపునకు వచ్చింది. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ బావమరిది అయిన రాహుల్ రెడ్డిపై ప్రేమ, పెళ్లి నెపంతో మోసం చేశారంటూ గతంలో ఎంవీపీ కాలనీ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట్లో ఈ వివాదంలోకి రాహుల్ సిప్లిగంజ్ పేరు రావడం, ఆయన బెదిరింపులకు పాల్పడ్డారనే ప్రచారం జరగడంతో ఈ అంశం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయితే ఇటీవల ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాధితురాలు మాట్లాడుతూ ఈ వ్యవహారంలో ఉన్న అసలు నిజాలను బయటపెట్టింది.తనకు, రాహుల్ రెడ్డికి మధ్య నడిచింది కేవలం వ్యక్తిగత విషయమని, ఇందులో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు ఎలాంటి సంబంధం గానీ, ప్రమేయం గానీ లేదని ఆమె స్పష్టం చేసింది. రాహుల్ రెడ్డికి బంధువు కావడం వల్లే రాహుల్ సిప్లిగంజ్ పేరును కొంతమంది బలవంతంగా ఈ వివాదంలోకి లాగారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా, ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యక్తులు తనను తీవ్రంగా మానసిక వేధింపులకు గురిచేశారని ఆరోపించింది. తనపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చి కొన్ని వీడియోలు చేయించారని, ఆ తర్వాత ఆ వీడియోలు, ఆడియోలను తమకు అనుకూలంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆమె వివరించింది.