Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

నెలాఖరులోగా మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Author Neti Sudiksha | 15 Aug 2026, 03:14 PM | భద్రాద్రి కొత్తగూడెం
నెలాఖరులోగా మారేళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 15: రాజీవ్ లింక్ కెనాల్‌కు గోదావరి జలాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విడుదల చేశారు. ఈరోజు(శనివారం) అశ్వాపురం మండలం సీతారామ పంప్ హౌస్ వద్ద మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.. మోటార్ స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగ్గా లేక పంటల సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా గోదావరి జలాలు.. సాగర్ ఆయకట్టుకు భరోసాగా మారిందన్నారు. మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నీళ్ల దగ్గర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
రైతులు ఎవరూ కూడా దిగులు పడొద్దని.. మీ భూముల్లో పైప్‌లైన్ వేసిన మరలా పూడ్చి ఇస్తామని మంత్రి చెప్పారు. యధావిధిగా మళ్లీ వ్యవసాయం చేసుకోవచ్చని అన్నారు. పినపాకకి నీళ్లు ఇవ్వకుండా ఖమ్మంకి తీసుకెళ్లటం బాధగా ఉందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎవరు ఎటువంటి రాజకీయాలు చేసినా నెలాఖరుకు మారేళ్లపాడు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.