Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఫొటో జర్నలిస్టులకు సాయిబాబా మందిరంలో సన్మానం

Author Neti Sudiksha | 20 Aug 2026, 04:23 PM | TELANGANA
ఫొటో జర్నలిస్టులకు సాయిబాబా మందిరంలో సన్మానం

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని హనుమకొండలోని ఏషియన్ మాల్‌ పక్కన ఉన్న సాయిబాబా మందిరంలో ఫొటో జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. సాయినాథుని ఆశీస్సులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఫొటో జర్నలిస్టులకు శాలువాలు కప్పి, సన్మానించి ఆత్మీయంగా అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మతుకుమల్ల హరిగోపాల్, ప్రధాన కార్యదర్శి వేయిగండ్ల రమేష్, ఆలయ ధర్మకర్త మండలి సభ్యుడు, పీఆర్‌ఓ నిమ్మల శ్రీనివాస్ తదితరులు ఫొటో జర్నలిస్టులను సన్మానించారు.

ఫొటో జర్నలిస్టులకు సాయిబాబా మందిరంలో సన్మానం - Additional Image

సమాజంలో జరిగే ప్రతి సంఘటనను కెమెరా కంటితో ప్రజల ముందుకు తీసుకువచ్చే ఫొటో జర్నలిస్టుల సేవలను ఈ సందర్భంగా నిర్వాహకులు కొనియాడారు. తమ చిరు సన్మానాన్ని స్వీకరించిన ఫొటో జర్నలిస్టులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

“బాబా ఆశీస్సులు మీ కెమెరా కంటికి, మీ అడుగులకు ఎల్లవేళలా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాం” అని నిర్వాహకులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ఫొటో జర్నలిస్టులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.