Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఢిల్లీలో రాహుల్‌ గాంధీ మెరుపు ధర్నా..

Author Neti Sudiksha | 21 Aug 2026, 02:31 PM | NATIONAL
ఢిల్లీలో రాహుల్‌ గాంధీ మెరుపు ధర్నా..

ఢిల్లీలో సెంట్రల్‌ డీసీపీ ఆఫీసు బయట ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ మరోసారి మెరుపు ధర్నా చేశారు. పెల్లెట్‌గన్‌ బాధిత విద్యార్ధినితో కలసి డీసీపీ ఆఫీసుకు వెళ్లిన రాహుల్‌, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్​ చేశారు.

రాహుల్‌గాంధీ డిమాండ్‌ను పోలీసులు తిరస్కరించారు. ఈనెల 17న మెయిల్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, దర్యాప్తు అధికారి పేరు, ఫోన్‌ నెంబర్‌ కూడా ఇవ్వట్లేదని రాహుల్‌ అసహనం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే వరకు కదిలేది లేదని రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు.