Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు రద్దు.. సెప్టెంబర్‌ 5న సీజేపీ మార్చ్‌ రద్దు

Author Neti Sudiksha | 01 Sep 2026, 05:18 PM | NATIONAL
విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు రద్దు.. సెప్టెంబర్‌ 5న సీజేపీ మార్చ్‌ రద్దు

జూలై 20న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనలకు సంబంధించి విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 20 నుంచి 25వ తేదీ వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నమోదైన కేసులను, క్రిమినల్‌ నేపథ్యం ఉన్న వ్యక్తులకు సంబంధించిన కేసులను మినహాయించి, రద్దు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.సుప్రీంకోర్టు నిర్ణయంపై సంతృప్తి వ్యక్తం చేసిన సీజేపీ.. సెప్టెంబర్‌ 5న ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన భారీ మార్చ్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. జూలై 20నాటి నిరసనలకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, భవిష్యత్తులో ఈ వ్యవహారానికి సంబంధించి కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.అయితే, క్రిమినల్‌ చరిత్ర ఉన్న 2,873 మంది వ్యక్తులపై జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసనలకు సంబంధించి ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఒక ఎఫ్‌ఐఆర్‌ను కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది.జూలై 25న ఇచ్చిన హామీ మేరకు బీహార్‌, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ల రద్దు కోసం దరఖాస్తులు దాఖలు చేసినట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు.భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇరువర్గాలు పరస్పర నమ్మకంతో చర్చించుకుంటే సమస్యలను పరిష్కరించుకోవచ్చని వ్యాఖ్యానించింది. దీనిపై సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. “మేము శత్రువులం కాదు. సానుకూల దృక్పథంతో సమస్యను పరిష్కరించాం” అని తెలిపారు.

విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు రద్దు.. సెప్టెంబర్‌ 5న సీజేపీ మార్చ్‌ రద్దు - Additional Image