Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

గ్లోబల్ సమ్మిట్- రక్ష ఎక్స్‌పోలో భాగ‌స్వాములు కండి...ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

Author Neti Sudiksha | 02 Sep 2026, 05:17 PM | NATIONAL, TELANGANA
గ్లోబల్ సమ్మిట్- రక్ష ఎక్స్‌పోలో భాగ‌స్వాములు కండి...ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు హాజ‌రుకావాల‌ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో డిసెంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు స‌ద‌స్సు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. స‌దస్సులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్‌పో-2026ను ప్రారంభించాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధ‌వారం భేటీ అయ్యారు.ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాల‌పై కేంద్ర మంత్రితో ముఖ్య‌మంత్రి చ‌ర్చించారు. రక్షణ ఎక్స్‌పో లో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సుతో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే రక్షణ ఎక్స్‌పోకు ర‌క్ష‌ణ శాఖ మంత్రి హాజరై మార్గనిర్దేశం చేస్తే, వారికి ఎంతో స్ఫూర్తిదాయ‌కంగా ఉంటుంద‌ని తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించే రక్షణ ఎక్స్‌పో-2026కు స్వాగతం పలికేందుకు త‌మ ప్రభుత్వం ఎదురుచూస్తోందని రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు.