Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

తెలంగాణ కాంగ్రెస్‌లో MLC ఎన్నికల హీట్

Author Neti Sudiksha | 05 Sep 2026, 01:34 PM | Politics
తెలంగాణ కాంగ్రెస్‌లో MLC ఎన్నికల హీట్

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగకముందే అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయం వేడెక్కింది. నోటిఫికేషన్‌ వెలువడటానికి నాలుగు నెలల ముందే హస్తం శిబిరంలో లాబీయింగ్ ప్రక్రియ ఊపందుకుంది.

రెండు గ్రాడ్యుయేట్, నాలుగు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై పార్టీ నాయకులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

పట్టభద్రుల స్థానాలపై ఉత్కంఠ..

ఎమ్మెల్సీలుగా సురభి వాణీదేవి , చింతపండు నవీన్ పదవీ కాలం ముగియనుంది. మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి సామా రామ్మోహన్ రెడ్డి, గాలి హర్షవర్ధన్, బి. వేణుగోపాల్, గౌరీశంకర్ నలుగురు నేతలు తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఇక ఖమ్మం-వరంగల్-నల్లగొండ గ్రాడ్యుయెట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రేసులో నిలిచేందుకు గుత్తా అమిత్ రెడ్డి, పున్న కైలాశ్ నేత, చనగాని దయాకర్, లోక్ యాదవ్ ఉత్సాహం చూపుతున్నారు. ఈ రెండు నియోజకవర్గాల్లో టికెట్ దక్కించుకోవడానికి ఆశావహులు ఇప్పటినుంచే తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
గవర్నర్ కోటా రేసులో ముమ్మర పోటీ..
వచ్చే నవంబర్, డిసెంబర్ నెలల్లో నాలుగు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ కానున్నాయి. ఈ నామినేటెడ్ స్థానాల కోసం పార్టీలో పోటీ తారాస్థాయికి చేరింది. ఈ కోటాలో అయోధ్య రెడ్డి , సత్తు మల్లేశ్ పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి. ఈ తరుణంలో రేవంత్‌కు దగ్గరైన బస్వరాజు సారయ్య పేరు అనూహ్యంగా తెరపైకి రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, ఈ వడబోతలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది వేచి చూడాల్సిందే మరి.

ఇవి కూడా చదవండి