Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కడియం శ్రీహరికి దళితులపై ప్రేమ లేదు: దాస్యం వినయ్‌ భాస్కర్

Author Neti Sudiksha | 08 Sep 2026, 01:06 PM | Politics, TELANGANA
కడియం శ్రీహరికి దళితులపై ప్రేమ లేదు: దాస్యం వినయ్‌ భాస్కర్

హనుమకొండ జిల్లా: కడియం శ్రీహరికి దళితులపై నిజమైన ప్రేమ లేదని, తన కుమార్తె పదవి కోసమే దళితులపై ప్రేమ ఉన్నట్లు కపట నాటకాలు ఆడుతున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌ భాస్కర్. విమర్శించారు.మంగళవారం హనుమకొండలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన దాస్యం వినయ్‌ భాస్కర్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని కోరుతూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడియం శ్రీహరికి రాజకీయ భిక్ష పెట్టింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని అన్నారు. అలాంటి కేసీఆర్‌కు దళితులపై ప్రేమ లేదని కడియం శ్రీహరి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎన్నడూ లేని విధంగా హౌస్ అరెస్టులు జరుగుతున్నాయని ఆరోపించారు.

కడియం శ్రీహరికి దళితులపై ప్రేమ లేదు: దాస్యం వినయ్‌ భాస్కర్ - Additional Image