Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

భర్త ఫోన్‌ ఎత్తలేదని భార్య ఆత్మహత్య.!

Author Neti Sudiksha | 08 Sep 2026, 04:51 PM | Crime
భర్త ఫోన్‌ ఎత్తలేదని భార్య ఆత్మహత్య.!

భర్త ఫోన్‌ ఎత్తలేదన్న మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండకు చెందిన దారావత్‌ శారద కుమార్తె అఖిల (24)కి మూడేళ్ల క్రితం మహబూబాబాద్‌కు చెందిన బానోత్‌ హుస్సేన్‌తో వివాహం జరిగింది.వీరికి 6 నెలల వయస్సు ఉన్న కుమార్తె ఉండగా, హుస్సేన్‌ మహబూబాబాద్‌లోని ఓ ఫైనాన్స్‌ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల అఖిల తన పుట్టింటికి వెళ్లగా, కుమార్తె ఏడుస్తోందని భర్తతో మాట్లాడేందుకు వీడియో కాల్‌ చేయగా హుస్సేన్‌ కాల్‌ ఎత్తలేదు. దీంతో మనస్తాపానికి గురైన అఖిల మహబూబాబాద్‌ పట్టణంలోని హస్తినాపురం కాలనీలో ఉన్న తన ఇంటికి చేరుకుని ఎలుకల మందు పేస్టు తీసుకోగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీంతో పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందిందన్నారు. మృతురాలి తల్లి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ ఇన్‌చార్జి సీఐ అంజలి తెలిపారు.