Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారకంగా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ - వంటింట్లో దొరికే ఫుడ్స్తో ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటున్న నిపుణులు

Author Neti Sudiksha | 15 Jun 2026, 11:46 AM | HEALTH
దీర్ఘకాలిక వ్యాధులకు ప్రధాన కారకంగా క్రానిక్ ఇన్ఫ్లమేషన్ - వంటింట్లో దొరికే ఫుడ్స్తో ఈ సమస్యను తగ్గించుకోవచ్చంటున్న నిపుణులు

కారణంగా డయాబెటిస్, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ వ్యాధులన్నింటికి దీర్ఘకాలిక వాపు (క్రానిక్ ఇన్​ఫ్లమేషన్) ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. అయితే, మన వంటింట్లో దొరికే యాంటీ ఇన్​ఫ్లమేషన్ గుణాలున్న వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. మరి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం!

పసుపు : ఇది వంటలకు రంగు, రుచి కోసమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పసుపులో ఉండే కర్కుమిన్ అనేది శక్తివంతమైన యాంటీ ఇన్​ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుందని చెబుతున్నారు. ఇది శరీరంలో వాపు కలిగించే ఎంజైములు, ప్రొటీన్లను అడ్డుకుంటుందని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో వాపును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్న ఎవరైనా తమ ఆహారంలో కొంత పసుపును చేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చని hopkinsmedicine పేర్కొంది.