Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

సంతాన భాగ్యానికి ఎన్నెన్ని చిక్కులో! - మంచి జీవనశైలితో సాధ్యమట!

Author Neti Sudiksha | 15 Jun 2026, 11:47 AM | HEALTH
సంతాన భాగ్యానికి ఎన్నెన్ని చిక్కులో! - మంచి జీవనశైలితో సాధ్యమట!

ఎంత చదువుకున్న, ఏ స్థాయికి ఎదిగిన, ఎన్ని సాధించిన 'అమ్మా, నాన్న' పిలుపును కోరుకోని వారు ఉండరు. కానీ, మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, అధిక రేడియేషన్, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వంటి కారణాల చేత చాలా మంది ఈ పిలుపుకు దూరమవుతున్నారు. ఈ క్రమంలోనే గర్భధారణ కోసం ఎంత ప్రయత్నిస్తున్నా.. చాలా మందిలో ఫలితం కనిపించడం లేదట. ఇలాంటి సమయంలో జీవనశైలి ఎలా ఉందో చూసుకోవటం మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే సంతానం కలగకపోవటం అనేది ఏదో ఒక్క సమస్యతో ముడిపడి ఉండదని తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మంచి జీవనశైలితో సంతాన భాగ్యం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం!

సంతానలేమి పై తీవ్రమైన మానసిక ఒత్తిడి, దీర్ఘకాలంగా నిద్రలేమి, ఎక్కువగా మొబైల్ ఫోన్లు, ల్యాప్​టాప్​లను చూడటం, వేళకు ఆహారం తినకపోవటం, పొగ తాగటం, మద్యం అలవాటు, భార్యభర్తల మధ్య ఆత్మీయత తగ్గటం వంటి రకరకాల అంశాలు ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు.