Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

రాష్ట్రంలో తిండికి తిప్పలు పడుతున్న మెడికోలు - తరచూ గుత్తేదారుల బదీలలతో ఆహారంలో నాణ్యత కరవు

Author Neti Sudiksha | 16 Jun 2026, 11:56 AM | TELANGANA, హైదరాబాద్
రాష్ట్రంలో తిండికి తిప్పలు పడుతున్న మెడికోలు - తరచూ గుత్తేదారుల బదీలలతో ఆహారంలో నాణ్యత కరవు

కాబోయే డాక్టర్లు నేడు తిండికి తిప్పలు పడుతున్నారు. రాష్ట్రంలోని పలు సర్కారు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌ విద్యార్థులు సమయానికి ఫుడ్ లేకపోవటంతో అవస్థలు పడుతున్నారు. గుత్తేదారులు తరచూ మారుతుండటంతో హాస్టళ్లలో మెస్ల నిర్వాహణ అస్తవ్యస్తంగా అయ్యింది. ఈ విషయంపై సంబంధిత ప్రిన్సిపాళ్లు దృష్టి పెట్టకపోవటంతో విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా అందని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కొత్తగా ఏర్పాటు చేసిన కాలేజీలల్లో ఈ సమస్య తలెత్తుతోంది.

ఉదయం అందని అల్పహారం : గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి ప్రతి నెల రూ. 3,500 వరకు మెస్ బిల్లులను వసూలు చేస్తున్నారు. వీరికి భోజనం వండి పెట్టేందుకు కళాశాలలు గుత్తేదారులను మాట్లాడుతున్నాయి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనాన్ని పెట్టాలి. కానీ వీటిని పాటించట్లేదు. ఉదాహరణకు నిర్మల్‌ మెడికల్‌ కళాశాలలో రెండు నెలలుగా విద్యార్థులకు ఉదయం అల్పాహారం పెట్టకపోవడంతో బయట హోటళ్లలో తినాల్సి వస్తోంది.