Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

సరికొత్త వ్యూహంతో బీఆర్ఎస్ Gen-Z పాలిటిక్స్ - వచ్చే ఎన్నికల్లో యువ ఓటర్లపై ఫోకస్

Author Neti Sudiksha | 16 Jun 2026, 11:58 AM | TELANGANA, హైదరాబాద్
సరికొత్త వ్యూహంతో బీఆర్ఎస్ Gen-Z పాలిటిక్స్ - వచ్చే ఎన్నికల్లో యువ ఓటర్లపై ఫోకస్

జెన్‌జీ యువతపై గురిపెట్టిన బీఆర్ఎస్ పార్టీ యువతే లక్ష్యంగా కొత్త రాజకీయ వ్యూహాన్ని అమలు చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. గత అనుభవాల దృష్టిలో పెట్టుకుని యువతతో పార్టీకి మరింత అనుసంధానం అవసరమన్న నిర్ణయానికి వచ్చింది. యువత, ఐటీ ఉద్యోగుల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఉన్న క్రేజ్ను ఓట్ల రూపంలోకి మార్చుకోవాలని భావిస్తోంది. త్వరలోనే పెద్ద ఎత్తున జెన్జీ యువతతో ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించేందుకు గులాబీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.