Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఆధార్‌‌ కార్డు దుర్వినియోగంపై పిటిషన్

Author Neti Sudiksha | 16 Jun 2026, 01:59 PM | ANDHRA PRADESH
ఆధార్‌‌ కార్డు దుర్వినియోగంపై పిటిషన్

ఆధార్ కార్డుల దుర్వినియోగంపై దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీం కోర్టు తాజాగా విచారణ చేపట్టింది. ఆధార్‌ను కేవలం ఐడీ ప్రూఫ్‌గా పరిగణించాలంటూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అశ్వినీ కుమార్ అనే న్యాయవాది ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆధార్ కార్డు కేవలం ఐడీ ప్రూఫ్‌గా మాత్రమే వినియోగమయ్యేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎన్నికల సంఘానికి మార్గదర్శకాలు జారీ చేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. పౌరసత్వం, స్థానికత, నివాస ధ్రువీకరణ పత్రంగా ఆధార్ వినియోగం కాకుండా స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని అభ్యర్థించారు. కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్ దరఖాస్తులో డేట్ ఆఫ్ బర్త్‌కు ధ్రువీకరణగా ఆధార్ వినియోగం ఆధార్ చట్టంలోని సెక్షన్ 9 ప్రకారం చెల్లదని అన్నారు.