Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

డూప్ లేకుండానే సమంత యాక్షన్ సన్నివేశాలు..

Author Neti Sudiksha | 17 Jun 2026, 11:58 AM | సినిమా
డూప్ లేకుండానే సమంత యాక్షన్ సన్నివేశాలు..

స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల కలయికగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సమంత ఈ చిత్రంలో గతంలో ఎప్పుడూ కనిపించని శక్తివంతమైన పాత్రలో నటించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఒక యాక్షన్ నేపథ్యం ఉన్న మహిళ సంప్రదాయ కుటుంబంలో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత ఆమె జీవితంలో చోటుచేసుకునే పరిణామాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందని సమాచారం. కుటుంబ కథాంశంతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని తెలుస్తోందిఇటీవల సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన నటి రచన, సమంత అంకితభావంపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ, “ఈ సినిమాలో సమంత దాదాపు అన్ని యాక్షన్ సన్నివేశాలను డూప్ లేకుండానే చేసింది. ఫైట్ మాస్టర్లు సూచించిన ప్రతి అంశాన్ని శ్రద్ధగా విని, ఎలాంటి సందేహం లేకుండా సన్నివేశాల్లో పాల్గొనేది. కొన్ని షాట్లు చూస్తేనే చాలా రిస్కీగా అనిపించేవి. అయినప్పటికీ సమంత ఎంతో ధైర్యంగా వాటిని పూర్తి చేసింది” అని తెలిపింది. సినిమాలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయని రచన పేర్కొంది. “తెరపై ఆ సన్నివేశాలు చూసినప్పుడు సమంత ఎంత కష్టపడిందో అందరికీ అర్థమవుతుంది. ఆమె చూపించిన కమిట్‌మెంట్ నిజంగా అభినందనీయం” అని చెప్పుకొచ్చింది.సమంత గతంలో కూడా తన పాత్రల కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుని కఠినమైన సన్నివేశాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ‘మా ఇంటి బంగారం’లో యాక్షన్‌కు మరింత ప్రాధాన్యం ఉండటంతో, ఈ సినిమాలో ఆమె ప్రదర్శనపై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా రచన చేసిన వ్యాఖ్యలు కూడా ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.