Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

హైవేపై కూలిన విమానం..

Author Neti Sudiksha | 17 Jun 2026, 12:38 PM | Array
హైవేపై కూలిన విమానం..

అమెరికాలోని టెక్సాస్‌లో మంగళవారం రాత్రి విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మినీ విమానం లారెడోలోని హైవేపై కుప్పకూలింది. కూలిన వెంటనే మినీ విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో హైవేపై ఒక్కసారిగా అలజడి మొదలైంది. కొంతమంది విమానం నుంచి దూరంగా పారిపోయారు. మరికొంతమంది మాత్రం తమ మంచి మనసును చాటుకున్నారు. తమ వాహనాలను వదిలేసి మరీ మినీ విమానంలో చిక్కుకుపోయిన వారికి సాయం చేయడానికి పూనుకున్నారు. విమానం కాక్‌పిట్‌ను బద్దలు కొట్టారు.లోపల ఉన్న వారిని బయటకు తీసుకువచ్చారు. ఈ సంఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. ‘లారెడోలో దాదాపు రాత్రి 10 గంటల సమయంలో మినీ విమానం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో మినీ విమానంలో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు మృత్యువాతపడ్డారు. హైవేపై వెళుతున్న వాహనదారులకు గాయాలు అయ్యాయా అన్నది తెలియరావాల్సి ఉంది. ప్రమాదం నేపథ్యంలో హైవేను రెండు వైపుల నుంచి మూసి వేశాము’ అని తెలిపారు.ప్రత్యక్ష సాక్షి జైరా గర్జా మాట్లాడుతూ.. ‘నేను నా సహోద్యోగి ఇంటికి కారులో వెళుతున్నాను. ఆ సమయంలో విమానం హైవేపై కుప్పకూలింది. నేను నా కారును ఆపేశాను. వీడియో రికార్డు చేస్తూ విమానం దగ్గరకు వెళ్లాను. విమానంలో ఇరుక్కుపోయిన ఓ వ్యక్తి కాక్‌‌పిట్ విండో బద్దలు కొట్టడానికి ప్రయత్నించసాగాడు. కొద్దిసేపటి తర్వాత పెద్ద సంఖ్యలో జనం అక్కడి వచ్చారు. బయటి వైపు నుంచి అద్దాన్ని బద్దలు కొట్టారు.