Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఓటరు జాబితా సవరణలో పారదర్శకతకు ప్రాధాన్యం: కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

Author Neti Sudiksha | 18 Jun 2026, 05:52 PM | Array
ఓటరు జాబితా సవరణలో పారదర్శకతకు ప్రాధాన్యం: కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు, జూన్ 18 (సుదీక్ష న్యూస్): ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు.

గురువారం ములుగు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎస్‌ఐఆర్ ప్రత్యేక హెల్ప్ డెస్క్‌ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా హెల్ప్ డెస్క్ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ, దరఖాస్తుల స్వీకరణ, నమోదు, పరిష్కార విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఓటర్లకు అవసరమైన సమాచారం, మార్గదర్శకాలను సకాలంలో అందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలని, పేర్ల చేర్పు, తొలగింపు, సవరణలకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

హెల్ప్ డెస్క్‌కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ చందర్ శేఖర్, డీపీఆర్‌ఓ రఫిక్, అడిషనల్ పీడీ శ్రీనివాస్, ఎన్నికల డీటీ నితీష్ కుమార్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.