Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Author Neti Sudiksha | 19 Jun 2026, 11:01 AM | Array
నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో తండ్రీకొడుకులు సహా మరొకరి మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన పెద్దవూర మండలం రామన్నగూడెం వద్ద అర్ధరాత్రి చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతి చెందిన తండ్రీకొడుకులు ఏపీలోని పల్నాడు జిల్లా ముప్పల్ మండలం కాకర్లపాలెం గ్రామానికి చెందిన కాకర్ల థామస్య(51), ప్రకాష్ రావు (35)గా గుర్తించారు. మరోవ్యక్తి వరంగల్ ఎస్‌ఎల్‌బీసీ సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న సాయికుమార్(20)గా పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.