Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

నేడు స్విట్జర్లాండ్‌లో అమెరికా -ఇరాన్‌ ప్రతినిధులు సమావేశం..

Author Neti Sudiksha | 19 Jun 2026, 11:50 AM | అంతర్జాతీయం
 నేడు స్విట్జర్లాండ్‌లో అమెరికా -ఇరాన్‌ ప్రతినిధులు సమావేశం..

పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అమెరికా-ఇరాన్‌క్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ గురువారం సంతకం చేశారు. చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా ఒప్పందంపై సంతకం చేశారని ఆయన కార్యాలయం తెలిపింది. హొర్ముజ్‌ జలసంధి తక్షణమే తెరుచుకుంటుందని పేర్కొన్నది. జీ7 శిఖరాగ్ర సమావేశం అనంతరం వెర్సైల్స్‌ ప్యాలెస్‌లో జరిగిన విందులో ట్రంప్‌ ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ నేపథ్యంలో నేడు స్విట్జర్లాండ్‌లో అమెరికా -ఇరాన్‌ ప్రతినిధులు సమావేశం కానున్నారు. శుక్రవారం స్విట్జర్లాండ్‌లోని బుర్గెన్‌స్టాక్ పర్వత ప్రాంత రిసార్ట్‌లో అమెరికా, ఇరాన్ ప్రతినిధులు సమావేశం కానున్నట్లు స్విస్ ప్రభుత్వం వెల్లడించింది. అందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఒప్పందంపై డిజిటల్‌ సంతకాలు పూర్తి కాగా నేటి ఇరు దేశాల సమావేశం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.