Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

నీట్ అడ్మిట్ కార్డులపై కీలక ప్రకటన..

నీట్ అడ్మిట్ కార్డులపై కీలక ప్రకటన..

నీట్ అడ్మిట్ కార్డులపై ఎన్‌టీఏ కీలక ప్రకటన చేసింది. అడ్మిట్ కార్డులను ఇప్పటికే డౌన్‌లోడ్ చేసుకున్నవారు మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. కొత్త అడ్మిట్ కార్డులను ఇంకా డౌన్‌లోడ్ చేసుకోని విద్యార్థుల కోసం ఎన్‌టీఏ నుంచి ఎస్‌ఎమ్‌ఎస్, ఈ-మెయిల్, వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. మే 3 నాటి పాత అడ్మిట్ కార్డులు ఇకపై చెల్లవని స్పష్టం చేసింది. కొత్త అడ్మిట్ కార్డ్‌లను అధికారిక వెబ్‌సైట్ నుంచి మాత్రమే డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. పలువురు విద్యార్థుల కోరిక మేరకు వారు కోరిన నగరాల్లో కొత్త పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

అందుబాటులోకి వాట్సాప్ సేవలు..

నీట్ 2026 అభ్యర్థుల కోసం ఎన్‌టీఏ వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. జూన్ 21 (ఆదివారం) జరగబోయే నీట్ రీ-ఎగ్జామినేషన్‌ సమాచారం ఇకపై నేరుగా వాట్సాప్‌ ద్వారా అభ్యర్థులకు అందనుంది. +91 78279 80287 నంబర్ నుంచి మాత్రమే అధికారిక సమాచారం వస్తుందని ఎన్‌టీఏ వెల్లడించింది. పేరుతో పాటు బ్లూ టిక్ ఉంటేనే అది నిజమైన ఖాతా అని పేర్కొంది. బ్లూ టిక్ లేని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లను నమ్మవద్దని విద్యార్థులను హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి