Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

కాచిగూడ-మురదేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌ ‘కుంట’వరకు పొడిగింపు

Author Neti Sudiksha | 19 Jun 2026, 12:50 PM | తెలంగాణ
కాచిగూడ-మురదేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌ ‘కుంట’వరకు పొడిగింపు

కాచిగూడ నుంచి కర్ణాటకలోని మురదేశ్వర్‌కు ప్రస్తుతం నడుస్తున్న వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‏ను కుంట వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. శుక్రవారం నుంచే ఇది అమల్లోకి రానుందని సీపీఆర్‌ఓ శ్రీధర్‌ తెలిపారు. అయితే, 12789/12790 రైళ్లు కాచిగూడ-మంగళూరు మధ్య సూపర్‌ఫాస్ట్‌గా, అక్కడి నుంచి కుంట వరకు నాన్‌ సూపర్‌ఫాస్ట్‏గా నడుస్తాయని ఆయన పేర్కొన్నారు.