Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

సింగరేణిపై బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి:

Author Neti Sudiksha | 19 Jun 2026, 01:28 PM | తెలంగాణ
సింగరేణిపై బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి:

సింగరేణిపై బీజేపీ ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. సింగరేణి సంస్థపై మాట్లాడే నైతిక అర్హత గానీ, అక్కడ పర్యటించే హక్కు గానీ బీజేపీకి ఎంతమాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న బీజేపీ నాయకులు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని సింగరేణికి వెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ చర్యల ద్వారా బీజేపీ ఎంతటి దౌర్భాగ్య స్థితిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోందని ఎద్దేవా చేశారు.

సింగరేణి సంస్థను దెబ్బతీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసి కుట్రలు పన్నుతున్నాయని అద్దంకి దయాకర్ ఆరోపించారు. పైకి మాత్రం వేర్వేరుగా నటిస్తున్నప్పటికీ.. ఈ రెండు పార్టీలు రాజకీయ మిత్రులని విమర్శించారు. సింగరేణిని చుట్టుముట్టి ఇరు పార్టీలు చేస్తున్నవి కేవలం రాజకీయాలేనని మండిపడ్డారు. దేశంలో బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తున్న విధానంపై, సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై కిషన్ రెడ్డి తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.