Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్‌కు అండగా సినీ నిర్మాత బండ్ల గణేష్

Author Neti Sudiksha | 20 Jun 2026, 10:29 AM | TELANGANA, వరంగల్
అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్‌కు అండగా సినీ నిర్మాత బండ్ల గణేష్

బాలుడి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం

హనుమకొండ, సుదీక్ష న్యూస్:
హనుమకొండకు చెందిన నిరంజన్ అనే బాలుడు అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న నేపథ్యంలో ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ మానవత్వాన్ని చాటుకున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న ఆయన స్వయంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే తన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ తరఫున నిరంజన్ చికిత్స కోసం రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. నిరంజన్ త్వరగా కోలుకుని సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. బాలుడి తల్లిదండ్రులు బండ్ల గణేష్ అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.
అరుదైన వ్యాధితో పోరాడుతున్న నిరంజన్‌కు ఇప్పటికే పలువురు దాతలు, అభిమానులు అండగా నిలుస్తుండగా, బండ్ల గణేష్ అందించిన ఈ భారీ ఆర్థిక సాయం కుటుంబానికి ఎంతో ఊరటనిచ్చిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న నిరంజన్‌కు అండగా సినీ నిర్మాత బండ్ల గణేష్ - Additional Image