Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు ప్రారంభం

Author Neti Sudiksha | 20 Jun 2026, 11:05 AM | TELANGANA, ఎడ్యుకేషన్
వాట్సాప్‌లో పాఠశాల విద్యా సేవలు ప్రారంభం

తెలంగాణ ప్రభుత్వం, విద్యాశాఖ మరియు మీసేవ (MeeSeva)సంయుక్త ఆధ్వర్యంలో....పాఠశాల విద్యా సేవలను వాట్సాప్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది

రాష్ట్రవ్యాప్తంగా 18 లక్షలకుపైగా విద్యార్థులు, తల్లిదండ్రులకు విద్యా సమాచారం, సేవలు ఇకపై నేరుగా వాట్సాప్ ద్వారా అందనున్నాయి.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేవలు:
* విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులు
* హాల్ టికెట్ల డౌన్‌లోడ్
* మార్కుల మెమోలు,పరీక్ష ఫలితాలు
* ఎస్‌ఎస్‌సీ మెమోలు
* బోనఫైడ్,ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు
* ఎస్‌ఎస్‌సీ మెమో సవరణల దరఖాస్తులు

ఇవి కూడా చదవండి

🔜 త్వరలో అందుబాటులోకి రానున్న సేవలు:
* యూనిఫాంలు,పాఠ్యపుస్తకాల పంపిణీ వివరాలు
* విద్యార్థుల హాజరు సమాచారం
* ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ దరఖాస్తులు
* మధ్యాహ్న భోజన పథకం వివరాలు
* ఆరోగ్య,సంక్షేమ కార్యక్రమాల సమాచారం
* క్రీడలు,సహపాఠ్య కార్యక్రమాల వివరాలు
* విద్యార్థులు,తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ

విద్యార్థులు,తల్లిదండ్రులకు ముఖ్యమైన సమాచారం, అవగాహన సందేశాలను చేరవేసేందుకు....
రాష్ట్ర పక్షి ‘పాలపిట్ట’ ను డిజిటల్ మస్కట్‌గా ప్రభుత్వం పరిచయం చేసింది.

మీసేవ సాంకేతిక సహకారంతో రూపొందించిన ఈ వాట్సాప్ ఆధారిత సేవలు,విద్యార్థులు మరియు తల్లిదండ్రులు కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గించి, వేగవంతమైన,పారదర్శకమైన మరియు ప్రజలకు చేరువైన డిజిటల్ విద్యా సేవలను అందించనున్నాయి.