Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

నైరుతికి పంచ భూతాల అడ్డంకి

Author Neti Sudiksha | 20 Jun 2026, 11:42 AM | జాతీయం, తాజా వార్తలు
నైరుతికి పంచ భూతాల అడ్డంకి

కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టుగా.. ఈసారి రుతుపవనాలు నెమ్మదించడానికి సైతం ఎల్‌నినోతోపాటు మరెన్నో కారణాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు 2026 జూన్‌ 4న భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత ఒక అడ్డంకిని ఎదుర్కొన్నాయి. దేశవ్యాప్తంగా ఈ అసాధారణ జాప్యానికి ఏదో ఒక కారకం కాకుండా అనేక వాతావరణ వ్యవస్థల సంక్లిష్టమైన పరస్పర చర్యే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.కర్ణుడి చావుకి కారణాలు అనేకం అన్నట్టుగా.. ఈసారి రుతుపవనాలు నెమ్మదించడానికి సైతం ఎల్‌నినోతోపాటు మరెన్నో కారణాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు 2026 జూన్‌ 4న భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత ఒక అడ్డంకిని ఎదుర్కొన్నాయి. దేశవ్యాప్తంగా ఈ అసాధారణ జాప్యానికి ఏదో ఒక కారకం కాకుండా అనేక వాతావరణ వ్యవస్థల సంక్లిష్టమైన పరస్పర చర్యే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రారంభంలో చురుగ్గా కదిలిన రుతుపవనాల పురోగతి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా నెమ్మదించింది. దీనివల్ల లోటు వర్షపాతం ఏర్పడి రైతులు, నీటి నిర్వాహకుల్లో ఆందోళనలను పెంచింది. నైరుతి రుతుపవనాల మందగమనానికి ముఖ్యంగా ఐదు ప్రధాన అడ్డంకులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.