Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ఐఐటీ బాంబే క్యాంప‌స్‌లో కుక్క‌ను చంపిన చిరుత‌..

Author Neti Sudiksha | 20 Jun 2026, 01:26 PM | జాతీయం
ఐఐటీ బాంబే క్యాంప‌స్‌లో కుక్క‌ను చంపిన చిరుత‌..

ఐఐటీ బాంబే క్యాంప‌స్‌లోకి ఓ చిరుత ప్ర‌వేశించింది. స్టాఫ్ హాస్ట‌ల్ ఏరియాలో ఓ కుక్క‌ను చంపేసింది. పోవాయ్‌లో ఉన్న వ‌ర్సిటీ సీసీ కెమెరాల‌కు ఆ ఘ‌ట‌న చిక్కింది. ఈ ఘ‌ట‌న 19వ తేదీ తెల్ల‌వారుజామున రెండు గంట‌ల‌కు జ‌రిగింది. క్యాంప‌స్‌లోకి చిరుత ప్ర‌వేశించ‌డంతో విద్యార్థులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. క్యాంప‌స్‌లోని రెసిడెన్షియ‌ల్ ఏరియాలో చిరుత సంచ‌రిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ఫిర్యాదు ఉన్న‌ది. హాస్ట‌ల్ మెట్ల వ‌ద్ద ఉన్న ఓ కుక్క‌ను చిరుత త‌న నోటితో ప‌ట్టి చంపేసింది. చాలా నెమ్మ‌దిగా వాకింగ్ చేసుకుంటూ వ‌చ్చిన ఆ చిరుత స‌డెన్‌గా కుక్క‌పై దాడి చేసింది. చ‌నిపోయిన కుక్క బాడీతోనే ఆ చిరుత అదృశ్య‌మైంది. క్యాంప‌స్ విద్యార్థులు, సిబ్బంది, స్థానికులు ఆ వీడియో చూసి భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. రాత్రి పూట సంచారం ఇబ్బందిగా మారిన‌ట్లు ఫిర్యాదు చేశారు. పోవాయ్ స‌మీపంలో అట‌వీ ప్ర‌దేశం ఉన్న కార‌ణంగా.. అక్క‌డ ప‌లు సంద‌ర్భాల్లో చిరుత‌లు క‌నిపించాయి.