Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

Author Neti Sudiksha | 21 Jun 2026, 12:35 PM | TELANGANA
ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ: జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు పూర్తి వాస్తవాలు చెప్పకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని అన్నారు.
వరంగల్ నగరంలోని మాడ వీధుల అభివృద్ధికి రూ.11 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.19 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలతో కలిసి సంయుక్త కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర సర్వే నిర్వహించాలని ప్రతిపాదించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శక పాలన, సంక్షేమ పథకాల అమలు, వరంగల్ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తోందని తెలిపారు.