Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

నాంపల్లి కోర్టు సమన్లు - విచారణకు హాజరు కాని అల్లుఅర్జున్‌

Author Neti Sudiksha | 22 Jun 2026, 12:54 PM | Cinema
నాంపల్లి కోర్టు సమన్లు - విచారణకు హాజరు కాని అల్లుఅర్జున్‌

నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకావాలని నటుడు అల్లు అర్జున్‌కు సమన్లు జారీ అయిన సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా హాజరు కావాలని 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేయగా, షూటింగ్ వల్ల వ్యక్తిగత హాజరు నుంచి అల్లు అర్జున్‌ మినహాయింపు కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అల్లుఅర్జున్‌ మినహా మిగతా నిందితులు నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. జడ్జి ముందు బాండ్లపై సంతకాలు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టు విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసింది.ట్రయల్ ప్రారంభానికి నాంపల్లి కోర్టు సిద్ధం : ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను ఏ-11గా చేర్చారు. ఏ-1 నుంచి ఏ-10 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని నిందితులుగా పేర్కొన్న పోలీసులు, ఇప్పటికే 23 మంది నిందితులపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 2024 డిసెంబర్ 4న పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరగగా, రేవతి అనే మహిళ మృతి చెందడంతో పాటు కుమారుడు శ్రీతేజ్‌కు తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే. నిందితుల వ్యక్తిగత హాజరు తర్వాత ట్రయల్ ప్రారంభానికి నాంపల్లి కోర్టు సిద్ధమైంది.