Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

అంగన్‌వాడీల్లో త్వరలో 15,982 పోస్టుల భర్తీ! - మీ జిల్లాలో ఎన్ని ఖాళీలున్నాయో చెక్​ చేసుకోండి

Author Neti Sudiksha | 23 Jun 2026, 12:15 PM | TELANGANA
అంగన్‌వాడీల్లో త్వరలో 15,982 పోస్టుల భర్తీ! - మీ జిల్లాలో ఎన్ని ఖాళీలున్నాయో చెక్​ చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. భారీ సంఖ్యలో 15,982 పోస్టులను సర్కారు భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని ఐసీడీఎస్‌(ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్​మెంట్ సర్వీసెస్) ప్రాజెక్టుల వారీగా ఖాళీలు గుర్తించిన శిశు సంక్షేమ శాఖ, భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో టీచర్‌ పోస్టులు, మహబూబ్‌నగర్‌లోని 4 ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో టీచర్లు, సహాయకులు కలిపి 177 పోస్టులకు ఆయా జిల్లా కలెక్టర్లు ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేశారు. అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో వేర్వేరుగా ప్రకటనలు ఇచ్చి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఇంటర్మీడియట్‌ తప్పనిసరి : 'సాక్ష్యం' అంగన్‌వాడీ నిబంధనల ప్రకారం అంగన్‌వాడీ టీచర్, సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్‌ (10+2) విద్యార్హతను రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తప్పనిసరి చేసింది. అలాగే పోస్టుల భర్తీలో ఈసారి కొత్తగా ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ మేరకు అంగన్‌వాడీ పోస్టుల భర్తీ చేయడానికి ప్రభుత్వం ఇటీవల అనుమతిని ఇచ్చింది.

కొత్తగా ఇంటర్వ్యూ విధానం : తాజాగా ఎంపిక విధానంలో ఇంటర్వ్యూకు అనుమతిస్తూ జీవో నంబరు 04, మార్కుల వెయిటేజీ ఖరారు చేస్తూ జీవో నంబరు 06ను సైతం జారీ చేసింది. ఆ ప్రకారం మల్టీజోన్‌-1(ఉత్తర తెలంగాణ) పరిధిలోని మొత్తం 20,584 అంగన్‌వాడీ సెంటర్లలో 1,853 టీచర్లు, 7,737 సహాయకుల పోస్టులు కలిపి మొత్తం 9,590 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. మల్టీ జోన్‌-2 (దక్షిణ తెలంగాణ) పరిధిలో 15,197 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1247 టీచర్లు, 5145 సహాయకులు కలిపి 6,392 ఖాళీలను గుర్తించారు.

ఇవి కూడా చదవండి

సుదీర్ఘ అధ్యయనం అనంతరం భర్తీకి గ్రీన్​ సిగ్నల్ : వాస్తవంగా ఈ అంగన్​వాడీ టీచర్, సహాయకుల పోస్టులు భర్తీ చేయాలని ఏడాదిన్నర క్రితమే సర్కారు నిర్ణయించింది. నియామక విధానం, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న సర్వీసు నిబంధనలు, తదితర అంశాలపై సర్వే చేసి నియామక విధానాన్ని ఇటీవల ఖరారు చేసింది.

అర్హతలు ఏం కావాలంటే?

అంగన్‌వాడీ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తెలంగాణలోని పట్టణాలు లేదా గ్రామాల్లో సంబంధిత వార్డులో స్థానికులై ఉండాలి.
గిరిజన, ఆదివాసీ తండాలు, గూడేలు, ఆవాసాల్లో పోస్టులకు సంబంధిత ఆవాస ఎస్టీ మహిళలే అర్హులు. ఎస్సీ వాడల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలే అర్హులుగా ఉంటారు.
అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి ఆ జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ) మాత్రమే అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూకు 10 మార్కులను ప్రభుత్వం కేటాయించింది.
టీచర్లు, సహాయకుల పోస్టులకు అప్లై చేసేందుకు ఇంటర్మీడియట్‌(10+2) పాసై ఉండాలి. సహాయకుల పోస్టులకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేనిపక్షంలో తదుపరి పదో తరగతి పాసైన వారిని పరిగణనలోకి తీసుకోవాలని ఎంపిక నిబంధనల్లో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
ఎంపికలో మార్కులకు వెయిటేజీ కూడా ఉంటుంది. ఇంటర్‌లో వచ్చిన మార్కులకు 70 శాతం, వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, దివ్యాంగులకు 5 శాతం చొప్పున వెయిటేజీ ఉంటుంది. ఇంటర్వ్యూలకు పది మార్కులుగా