Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

మూతపడ్డ స్కూల్స్​ మళ్లీ తెరుచుకుంటున్నాయి : జగిత్యాల జిల్లాలో 13 బడులు రీఓపెన్​

Author Neti Sudiksha | 23 Jun 2026, 12:18 PM | NATIONAL
మూతపడ్డ స్కూల్స్​ మళ్లీ తెరుచుకుంటున్నాయి : జగిత్యాల జిల్లాలో 13 బడులు రీఓపెన్​

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏళ్లుగా మూతబడ్డ సర్కారు బళ్లు తిరిగి తెరచుకుంటున్నాయి. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 13 స్కూళ్లు ఈ విద్యా సంవత్సరం తెరచుకున్నాయి. గ్రామ పంచాయతీ పాలక వర్గం, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, తల్లితండ్రులు ప్రత్యేక చొరవ తీసుకుని పిల్లల్ని సర్కారు బళ్లకు పంపుతున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ బళ్లల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రైవేటు పాఠశాలల బస్సులను రాకుండా అడ్డుకుంటున్నారు. సర్కారీ బడిలో విద్య సహా ఇతర సదుపాయాలపై పేరెంట్స్‌కు అవగాహన కల్పిస్తున్నారు.

పదేళ్ల తర్వాత తండాలో బడి : ఇది జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం రంగారావుపేట తండా. ఈ తండాలో పదేళ్ల కిందట సర్కారు బడి నడిపారు. వివిధ కారణాలతో అప్పట్లో నడిపిన బడిని మూసివేశారు. అప్పటి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిట్టంపేటలోని సర్కారు బడికి తమ పిల్లల్ని పంపేవారు. బస్సులో వెళ్లి, బస్సులో వచ్చేవారు. కొంతమంది తల్లితండ్రులు తమ పిల్లల్ని తమవెంట కూలీ పనుల కోసం తీసుకెళ్లేవారు. పదేళ్ల తర్వాత ఇప్పుడు ఆ తండాలో సర్కారు బడి తెరుచుకుంది.