Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV

'నారా' వారి కుటుంబంలో వారసుడు - తండ్రైన హీరో రోహిత్

Author Neti Sudiksha | 24 Jun 2026, 01:01 PM | Cinema
'నారా' వారి కుటుంబంలో వారసుడు - తండ్రైన హీరో రోహిత్

టాలీవుడ్ విలక్షణ నటుడు నారా రోహిత్ తండ్రి అయ్యారు. ఆయన భార్య శిరీష హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో నారా కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం తల్లీ బిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

నారా రోహిత్ దంపతులకు మగబిడ్డ విషయం తెలిసిన తర్వాత అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. నారా రోహిత్, శిరీష కలిసి 'ప్రతినిధి 2' చిత్రంలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. అక్టోబర్ 30, 2025న హైదరాబాద్‌లో వీరి వివాహం ఘనంగా జరిగింది. రోహిత్ పెదనాన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు- భువనేశ్వరి దంపతులు ఈ పెళ్లికి పెద్దగా వ్యవహరించారు. హీరో నారా రోహిత్‌ తండ్రి కాబోతున్నారనే విషయాన్ని దంపతులు అధికారికంగా ప్రకటించనప్పటికీ శిరీష బేబి బంప్​తో ఉన్న వీడియో రెండు నెలల క్రితమే సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యింది.

నారా రోహిత్ కెరీర్ విషయానికి వస్తే, ఆయన ప్రస్తుతం వెంకటేశ్‌ హీరో​గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న 'ఆదర్శ కుటుంబం - హౌస్‌ నెం.47' సినిమాలో కీ రోల్ పోషిస్తున్నారు. కుటుంబ భావోద్వేగాలతో మిళితమై క్రైమ్‌ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. రోహిత్ బీ-టెక్ పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సు చేశారు. 2009లో 'బాణం'తో డెబ్యూ చేశారు. ఇప్పటిదాకా వరకు 20కి పైగా చిత్రాల్లో నటించిన రోహిత్ వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

2011లో 'సోలో' సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. 2014లో విడుదలైన 'ప్రతినిధి' 'రౌడీ ఫెల్లో' చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. 2025లో రోహిత్ 20వ చిత్రం 'సుందరకాండ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే ఏడాది 'భైరవం' క్రైమ్ థ్రిల్లర్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్‌తో కలిసి నటించి మెప్పించారు.